మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్నికూల్చివేయడం బాధాకరమన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందన్నారు. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గా నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని ప్రకటించారు.