మెట్ పల్లి పట్టణంలో మాన్యశ్రీ కాన్షీరామ్ 91 జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బహుజనులకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బత్తుల లక్ష్మణ్, గోరుమంతుల సురేందర్, నీరటి నరేందర్, కురుమ దేవయ్య, తరి స్వామి, మేకల ఉపేందర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.