మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. మరోసారి జగన్ రెడ్డిని ఏకి పారేశారు. పూర్వ కాలంలో మహరాజులు కోటల్లో ఉండేవారని, వారి చుట్టూ కోటరీ ఉండేదన్నారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా కోటరీ చెప్పిందే నడిచేదన్నారు. ఇప్పుడు జగన్ రాజు లాగా భావిస్తున్నారని, తన చుట్టూ కోటరీ ఏది చెప్పితే అదే చేస్తున్నాడని అందుకే తాను తనతో పాటు పార్టీని వదిలేయాల్సి వచ్చిందన్నారు. ప్రజల మనసు ఎరిగి రాజు నడుచు కోవాలని, కానీ ఆ పని జగన్ చేయడం లేదంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు విజయ సాయి రెడ్డి.