ఇప్పటికే హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారి పోయింది. ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికే మై హోం, తదితర నిర్మాణ సంస్థలు ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా కోకా పేట్ లో వచ్చే నాలుగు సంవత్సరాలలో 100 అంతస్తుల భవనం నిర్మాణం కానుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొల్లూరు పీఎస్ మాన్ నగర్ లో త్వరలో తొలి ల్యాండ్ మార్క్ 70 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.