ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004, 2019లో నన్నెవరూ ఓడించ లేదన్నారు. ఆ ఎన్నికల్లో పరాజయానికి తానే ప్రధాన కారణమని అన్నారు. సీఎం చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపాయి. కొన్ని పనులు చేయలేక పోవడం వల్లే ఓడిపోయామన్నారు. పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేక పోయానని ఒప్పుకున్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి అనేది ఉండదన్నారు సోమవారం జరిగిన అసెంబ్లీలో.