తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టారు మంత్రి దామోదర రాజ నరసింహ. ఫిబ్రవరి 4 (సోషల్ జస్టిస్ డే), మార్చి 18 తేదీలు చరిత్రలో నిలిచి పోతాయన్నారు. దళితుల దశాబ్దాల కల నెరవేరుస్తున్న విజనరీ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు సీఎం దార్శనికతకు నిదర్శమన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటి కాదన్నారు. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు. ఎంతో మంది త్యాగాలు చేశారని తెలిపారు.