నాగల్ గిద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్నాయి. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని మండల విద్యాధికారి మన్మధ కిషోర్ తెలిపారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. వారితోపాటు కారముంగీ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ రావు, పిఆర్టియు మండల అధ్యక్షులు శేరికార్ రమేష్, బాబుశేట్టి, జీవన్ రావు పాటిల్ ఉన్నారు.