వైఎస్సార్సీపీ చీఫ్ ,మాజీ సీఎం జగన్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు పీఎం నరేంద్ర మోదీకి. రాబోయే డీలిమిటేషన్ కసరత్తును లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరారు. ఇదే సమయంలో తమ పార్టీ నాయకుడి ఆదేశాల మేరకు పార్టీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి డీఎంకే పార్టీ నేతలకు అదే లేఖను పంపించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో న్యాయమైన, సమ తుల్య విధానం అవలంభించాలని స్పష్టం చేశారు. తాజాగా జగన్ రాసిన లేఖ కలకలం రేపుతోంది.