యూరియా కొరతతో రైతుల ఇక్కట్లు
NEWS Sep 05,2025 07:08 pm
ఏపీలో రైతులకు సకాలంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తక్షణమే ఏపీకి పెద్ద ఎత్తున యూరియా కేటాయించాలని కోరారు. కూటమి సర్కార్ యూరియా కొరతపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లోకి తరలి పోతున్నా కిమ్మనడం లేదంటూ మండిపడ్డారు ఎంపీ.