బొకేలు వద్దు.. పుస్తకాలు ముద్దు..
NEWS Jan 01,2026 09:20 pm
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ నూతన సంవత్సరాన్ని వినూత్నంగా ఆరంభించారు. సంప్రదాయంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు, స్వీట్లకు బదులుగా పేద పిల్లలకు ఉపయోగపడే దుప్పట్లు, స్టేషనరీ సామాగ్రి, పుస్తకాలు తీసుకురావాలని ’కం విత్ బుక్’ కార్యక్రమం ద్వారా కలెక్టర్ పిలుపునిచ్చారు. దాంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ కిట్లు, దుప్పట్లు అందజేశారు. సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించిందని ప్రజలు అభినందించారు.