చివరి అంకానికి మేడారం జాతర
NEWS Jan 31,2026 05:09 pm
మేడారం జాతర చివరి అంకానికి చేరింది. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నేటి రాత్రి తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. ఈ క్రమంలో కనుచూపు మేర ఎటు చూసినా జన ప్రవాహం.. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి జనం పోటెత్తారు. 4 రోజుల జాతరలో పాల్గొన్న జనం.. మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించారు.