SP ఆఫీసులో నూతన సంవత్సర వేడుకలు
NEWS Jan 01,2026 09:22 pm
నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల కేక్ కట్ చేసి పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలకు విషెస్ చెప్పారు. గత ఏడాది జిల్లా పోలీసు శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించి శాంతి–భద్రతల పరిరక్షణలో ప్రజల విశ్వాసాన్ని అందుకుందని ఎస్పీ తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత చేరువైన పోలీసింగ్, నేర నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, మహిళలు, పిల్లల భద్రతపై మరింత దృష్టి పెట్టనున్నట్టు జానకి షర్మిల తెలిపారు.