నిర్మల్ జిల్లా SPకి పదోన్నతి
NEWS Jan 01,2026 09:22 pm
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సీనియర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం, అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి–భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రత, పోలీసింగ్‌లో చేపట్టిన సమర్థవంతమైన చర్యలకు ప్రశంసలు లభించాయి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత హోదాలు అధిరోహించాలని అధికారులు, సిబ్బంది ఆకాంక్షించారు.