జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
NEWS Jan 01,2026 09:24 pm
TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ డిపో మేనేజర్ కే. పండరి ఆధ్వర్యంలో నిర్మల్ RTC డిపోలో జాతీయ రోడ్డు మాసోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా AMVI అసిఫ్ హాజరయ్యారు. రోడ్డు భద్రత అందరి బాధ్యతేనని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ప్రయాణికుల ప్రాణాలను నమ్ముకొని బస్సులో ప్రయాణిస్తారని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. ముందు వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేముందు ఎదురుగా వచ్చే వాహనాలు గమనించాల్సిన అవసరం ఉందని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని డిపో మేనేజర్ సూచించారు.