రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్
NEWS Jan 01,2026 09:35 pm
కొత్తగూడెం: పాల్వంచలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ముద్రించిన రోడ్డు భద్రత పోస్టర్లు, ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడీఓసి కార్యాలయంలో ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రతి పౌరుడు రోడ్డు భద్రతను తన బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపు ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.