కలెక్టర్ వినూత్న పిలుపు..
పూలకు బదులు నోట్ బుక్స్ పెన్నులు
NEWS Jan 01,2026 09:37 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వి. పాటిల్ నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా మార్చారు. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు పూల బొకేలు కాకుండా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. దీనికి స్పందించిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున స్టేషనరీ సామాగ్రిని అందజేశారు. వీటిని త్వరలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు. “వృథా అయ్యే బొకేల కంటే విద్యార్థుల చదువుకు తోడ్పడే వస్తువులు ఉపయోగకరం” అని ఆయన పేర్కొన్నారు.