అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
NEWS Jan 01,2026 09:17 pm
జగిత్యాల జిల్లా పశువైద్య & పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా శాఖ అధికారి డా. బి.ప్రకాష్, అసిస్టెంట్ డైరెక్టర్ డా. బి.నరేష్‌ను అసోసియేషన్ అధ్యక్షురాలు డా. కొమ్మెర మనీషా పటేల్ వ్యవహరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బద్దం రాజేందర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ డా.అశోక్, ఉపాధ్యక్షులు డా.హిమజ, జాయింట్ సెక్రటరీ డా.రాకేష్ పాల్గొన్నారు.