BSNL తమ కస్టమర్ల కోసం కీలకమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను ప్రారంభించింది. ఈ సేవలు BSNL కస్టమర్లందరికీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే అందుబాటులో ఉంటాయి. మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి.