అయ్యప్పస్వాములకు ముస్లిం సోదరుడి అన్నప్రసాదం
NEWS Jan 01,2026 09:33 pm
మెట్‌పల్లి పట్టణానికి చెందిన మహ్మద్ ఖుతుబొద్దీన్ పాషా మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం అయిపోయాడు. పట్టణంలోని సుమారు 25 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం నిర్వహించి, స్వయంగా వడ్డించి, అనంతరం భిక్షగా తీసుకున్నారు. మత భేదాలను పక్కనపెట్టి ఇలాంటి సేవ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని పాషా తెలిపారు. ఏటా అయ్యప్ప మాలధారణ సమయంలో ముస్లిం సోదరులు ముందుకు వచ్చి అన్నదానం చేయడం హర్షణీయమని అయ్యప్ప భక్తులు పేర్కొన్నారు. సమాజానికి ఒక మంచి సందేశం అందించిన ఖుతుబొద్దీన్ పాషా సేవను అందరూ అభినందిస్తున్నారు.