తెలంగాణలో వెయ్యి కోట్ల మద్యం తాగేశారు
NEWS Jan 01,2026 09:46 pm
హైదరాబాద్: తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం, డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోనే దాదాపు రూ.1,000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో రూ.736 కోట్లు కాగా, ఈసారి రూ.980 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,620 మద్యం దుకాణాలు, 1,100 బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు కలిసి డిసెంబర్ నెలలో మొత్తం రూ.4,920 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి కొనుగోలు చేసినట్లు ఆబ్కారీ శాఖ పేర్కొంది.