మెట్‌పల్లిని దట్టంగా కమ్మేసిన పొగమంచు
NEWS Jan 02,2026 08:36 am
మెట్‌పల్లి పట్టణంలో ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉ. 8.30 గంటలు దాటినా పొగమంచు పూర్తిగా తొలగకపోవడంతో వాహనదారులు లైట్లు వెలిగించుకుని రాకపోకలు సాగించారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. చలికి తట్టుకోలేక స్థానికులు పలు ప్రాంతాల్లో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందారు. చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు చలితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, ప్రకృతి ప్రేమికులు ఉదయపు పొగమంచు అందాలను తిలకిస్తూ సోయగాలకు పరవశిస్తున్నారు.