గ్రామ పరిధిలోని D83 కెనాల్‌లో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సాగునీటి మోటర్లు కొట్టుకుపోవడం, తరచూ కాలిపోవడం జరుగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్ల మరమ్మతుల కోసం ప్రతి సారి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కెనాల్‌పై సరైన బ్రిడ్జి లేకపోవడంతో అవతల వైపు ఉన్న సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూములకు చేరుకోవడం రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. పంట పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోతున్నాయని రైతులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా D83 కెనాల్‌పై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను వ్యక్తం చేశారు.