భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్ధులతో వెళ్తున్న KLR ఇంజినీరింగ్ కాలేజీ బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. అశ్వాపురం (M) మొండికుంట అడవిలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్దులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు బస్సు కింద నలిగి తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.