ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Jan 02,2026 05:31 pm
కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రక్రియలో భాగంగానే నేడు ఈవీఎం గోడౌన్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, సీల్‌లు, రికార్డులను పరిశీలించినట్లు చెప్పారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.