టిఫిన్ చేస్తుండగా చట్నీలో బల్లి
NEWS Jan 02,2026 12:05 pm
జగిత్యాల పట్టణంలో కలకలం రేగింది. శివ సాయి టిఫిన్ సెంటర్ లో టిఫిన్‌తో పాటు ఇచ్చిన చట్నీలో బల్లి ప్రత్యక్షమైంది. టిఫిన్ చేస్తుండగా చట్నీలో బల్లి కనిపించడంతో అక్కడ ఉన్న మహిళ ఒక్కసారిగా హడలిపోయింది. ఈ ఘటనలో టిఫిన్ తిన్న 8 మంది వాంతులు, అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆహార భద్రతపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.