శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు
NEWS Jan 02,2026 06:22 pm
పాల్వంచ పట్టణంలోని శ్రీ భజన మందిరం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా నిత్యం స్వామి వారి అష్టోత్తరాలు స్వామివారి స్తోత్రాలు తెల్లవారుజామున 4 నుండి 6 దాకా వేద పండితులు వంశీ ఆచార్యులు, అనిల్ ఆచార్యులు ఆధ్వర్యంలో జరుగుతున్నవి. అందులో భాగంగా తిరుప్పావై మహిళ భక్తులచే ఘనంగా స్వామివారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త చలవాది ప్రకాష్, భక్తులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.