నిర్మల్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన సాయికుమార్ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. మరుసటి రోజు చెక్‌అవుట్ సమయంలో హోటల్ సిబ్బంది సంప్రదించగా ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం కలిగింది. మాస్టర్ కీతో గది తలుపులు తెరిచి చూడగా ఉరివేసుకుని మృతి చెందినట్టు గుర్తించారు. నిర్మల్ పట్టణ పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.