సంక్రాంతి ఎఫెక్ట్.. బస్సుల్లో ఛార్జీల మోత!
NEWS Jan 04,2026 11:25 am
సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని ఏజెన్సీలు ₹2,700 నుంచి ₹4,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైన్ రిజర్వేషన్లు దొరకకపోవడంతో ప్యాసింజర్స్ ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రావెల్స్ వారు సీటును బట్టి ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది.