పోడు భూములకు రోడ్డు మంజూరు చేయండి
NEWS Jan 08,2026 01:09 am
అనంతగిరి మండలం పినకోట గ్రామంలో కొండ పోడు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కొండపోడులో పండే ఫలాశయాల రవాణా, రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బొర్రపాలెం మెయిన్ రోడ్డు నుంచి పెదబురగ దారి వరకు సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామసభలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి బొంజునాయుడు, సంపంగి ప్రసాద్, పాడి చిన్నులు, సొమెల సహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.