అనంతగిరి మండలంలోని Pinakotaలో ఉన్న గిరిజన బాలుర పాఠశాల ప్రహరీ గోడను వెంటనే పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో 200కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. 2017లో ప్రారంభించిన ప్రహరీ గోడ నిర్మాణాన్ని అర్ధంతంగా వదిలేయడంతో విషసర్పాలు, పశువులు లోపలికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రహరీ గోడ పూర్తి చేయాలని కోరుతున్నారు.