రెండు గ్రామాలకు రోడ్డు సర్వే
NEWS Jan 08,2026 01:05 am
అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని వీరభద్రపురం నుంచి వలసలగరువు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం సర్వే నిర్వహించినట్లు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ జోగి బేబీలత తెలిపారు. చింతపాక నుంచి వలసలగరువు వరకు 5 కి.మీ., వలసలగరువు నుంచి కొత్తబురగ వరకు 2 కి.మీ. దూరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి. సురేష్, జి. గణేష్, టి. గంగానదొర, టి. రామారావు, జీ. కన్నయ్యదొర పాల్గొన్నారు.