పెద్దకల్వల కెనాల్‌లో చెత్త తొలగింపు
NEWS Jan 07,2026 02:23 pm
పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ పరిధిలోని కెనాల్ కాల్వలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా జెసిబి సహాయంతో కెనాల్‌లోని చెత్తను పూర్తిగా తొలగిస్తున్నారు. పెద్దకల్వల గ్రామ సర్పంచ్ నర్ల కనకమ్మ, పోలు రాజ్ మాట్లాడుతూ— గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, కాల్వల ద్వారా నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులు కూడా సహకరించాలని వారు కోరారు.