సబ్బితం: ఇందిరమ్మ చీరల పంపిణీ
NEWS Jan 07,2026 02:22 pm
పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో గ్రామ సర్పంచ్ నూనె సరోజన–రమేష్‌లు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచ్ నూనె సరోజన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొంతకాలంగా చీరల పంపిణీ నిలిచిపోయిందని తెలిపారు. కోడ్ ముగియడంతో మళ్లీ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.