మార్కెట్ కమిటీ అభివృద్ధిపై సమావేశం
NEWS Jan 07,2026 02:15 pm
కథలాపూర్: మండలంలోని మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు. మార్కెట్ కార్యాలయం చుట్టూ విస్తరించి ఉన్న తుమ్మ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రైతుల సౌకర్యార్థం గోదాం ఏర్పాటు చేయాలని, మార్కెట్ కార్యాలయం మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించేలా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్లు హాజమ్, పంభాల శంకర్, వెంకటేష్, రమేష్ నాయక్, చీటి జగన్ రావు, వాకిటీ రాజారెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.