మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ‘దృశ్యం 3’ సినిమాను 2026 ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవద్దని ప్రేక్షకులను కోరారు. అజయ్ దేవగణ్ నటిస్తున్న హిందీ రీమేక్ 2026 అక్టోబర్‌లో రానుండగా, మలయాళ ఒరిజినల్ వెర్షన్ అంతకంటే 6 నెలల ముందే (ఏప్రిల్‌లో) ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే అధికారిక తేదీని వెల్లడిస్తామని తెలిపారు.