గజగజ వణుకుతోన్న జనం!
NEWS Jan 10,2026 10:46 am
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తూనే ఉంది. 2-3 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. తెలంగాణలో 14 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5.6 డిగ్రీలుగా ఉంది. అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. నిన్న రాత్రి పాడేరులో 4.1, పెదబయలు 4.8, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.