పేగు బంధాన్ని కాలరాస్తున్నారు
NEWS Jan 10,2026 12:14 pm
కొందరు తల్లిదండ్రులు కన్నపేగు బంధాన్ని కాలరాస్తున్నారు. కృష్ణా జిల్లాలో 45రోజుల పసికందును ఓ తల్లి నీటిగుంటలో విసిరేసింది. నారాయణపేట జిల్లాలో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. తాజాగా రంగారెడ్డిలో ఓ తల్లి 10నెలల కొడుకును విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. అత్త సూటిపోటి మాటలు, భార్యతో గొడవలు, భర్త వేధింపులు కారణమేదైనా రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపడం కలవరపెడుతోంది.