జాతరకు ముందే జనసంద్రంగా మేడారం
NEWS Jan 10,2026 01:21 pm
ములుగు జిల్లా మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతర దగ్గర పడుతుండటంతో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణమంతా జన సందోహంగా మారింది. బెల్లం, చీర, సారా, పసుపు కుంకుమలతో మొక్కలు చెల్లించుకుంటున్నారు.జనవరి 19న సీఎం జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారు. జనవరి 28 నుంచి 31వ వరకు మేడారం జాతర జరగనుంది.