చిరంజీవి సినిమాకు టికెట్ ధరల పెంపు
NEWS Jan 10,2026 02:07 pm
చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 11న రాత్రి 8–10 మధ్య ప్రీమియర్ షోలు, టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు రెగ్యులర్ షోలకూ ధరల పెంపుకు అనుమతిచ్చారు. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.