తెలంగాణకు ఆంధ్రా ప్రేమను పంచండి: పవన్
NEWS Jan 10,2026 11:19 pm
కాకినాడ జిల్లా పిఠాపురంలో 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల'ను డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సంక్రాంతికి తెలంగాణ సోదరసోదరీమణులను ఆహ్వానించి, వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపించాలని, పీఠికాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామాగా నిలవాలి" అని పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే కేవలం కోడిపందేలు, జూదాలు కాదని, సంస్కృతీ సంప్రదాయాల కలయిక అని అన్నారు. సరదాలను కాదనడం లేదని, కానీ పండుగ ఆ ఒక్కదానికే పరిమితం కాకూడదని సూచించారు.