తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది.