NREGS పేరు మార్చితే సహించం: MLA
NEWS Jan 11,2026 12:42 pm
నిర్మల్: MLA వెడ్మ బొజ్జు, ఉపాధి హామీ పథకం పేరును మార్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. NREGS (ఉపాధి హామీ) పథకం పేరును మార్చితే సహించేది లేదని, ఉపాధి హామీ పథకం గ్రామీణ కూలీల జీవనాధారమని, ఆ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని ఆయన గుర్తుచేశారు. కూలీల పొట్టకొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను కూడా ఉపాధి హామీ పనులు చేసి ఎదిగిన వ్యక్తినని పేర్కొన్న వెడ్మ బొజ్జు, మహాత్మా గాంధీ పేరును తొలగించి మరో పేరు పెట్టే ప్రయత్నం చేస్తే గ్రామగ్రామాన నిరసనలు చేపడతామని తెలిపారు. అలాంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.