అబ్కారి దాడులు: నలుగురిపై కేసులు
NEWS Jan 11,2026 02:44 pm
నిర్మల్ జిల్లాలోని పెద్దూర్ తండా, చిన్నబెల్లాల్, పెద్ద బెల్లాల్, రాంరెడ్డి పల్లె, సత్తెనపల్లి ప్రాంతాల్లో అబ్కారి అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తుల నుంచి 23 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకుని, 800 లీటర్ల నల్లబెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నాటుసారాయి తయారీ, అమ్మకం, రవాణా చేయడం, అలాగే నల్లబెల్లం మరియు పట్టిక విక్రయాలు చట్టరీత్యా నేరమని రంగస్వామి స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.