చివరి రైతాంగానికి నీరు అందించాలి
NEWS Jan 11,2026 02:46 pm
కడెం మండలంలో రైతులు సదర్మాట్ బ్యారేజ్ ప్రత్యేక కాలువ నిర్మాణం కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. రైతులు మాట్లాడుతూ, సదర్మాట్ బ్యారేజ్‌ను ఖానాపూర్ ప్రాంతంలో నిర్మించాల్సి ఉండగా, పొన్కల్‌కు తరలించడం ద్వారా గత ప్రభుత్వం చివరి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. 55 గేట్లతో సదర్మాట్ బ్యారేజ్ నిర్మాణం పూర్తైనప్పటికీ, కుడి–ఎడమ కాలువలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సాగునీటి లాభం అందడంలేదన్నారు. అలాగే సదర్మాట్ నుంచి వారబంది పద్ధతికి బదులుగా ప్రతిరోజూ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.