ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
NEWS Jan 11,2026 02:48 pm
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలు, కూలీలకు జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు పూర్తిగా ప్రజావ్యతిరేకమని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఉపాధి హామీ చట్టం బలహీనపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, పేదల జీవితాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని పాత చట్టాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.