ఉద్యోగాల పేరిట భారీ మోసం- అరెస్టు
NEWS Jan 11,2026 02:49 pm
ఆదిలాబాద్ పోలీసులు ఉద్యోగాల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, అనంత్ ఈ సొల్యూషన్, విద్యాదాన్ ఎన్జీవో పేర్లతో నిరుద్యోగులను మోసం చేస్తున్న మధు కిరణ్, సుధాకర్, సతీశ్‌లను శనివారం అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ నిధులను కాజేయాలనే లక్ష్యంతో నకిలీ నియామకాలు నిర్వహించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.