'నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం'
NEWS Jan 11,2026 02:51 pm
నిర్మల్ జిల్లాలో జరగనున్న నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొనేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని, ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాలు ప్రజలకు గుర్తుండిపోయేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.