ప్రధాని మోదీ గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. \'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్\' వేడుకల్లో సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని స్వయంగా అభిషేకం, హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. యాత్ర సాగుతున్న దారి పొడవునా ప్రజలు బారులు తీరి \'మోదీ-మోదీ\' నినాదాలతో, పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శివుడికి ప్రతీకగా భావించే డమరుకం శబ్దాలు మిన్నంటగా, మోదీ కూడా ఉత్సాహంగా డమరుకాన్ని చేతుల్లోకి తీసుకుని వాయించారు. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.