మెగాస్టార్ మూవీకి నిమిషాల్లోనే హౌస్‌ఫుల్!
NEWS Jan 11,2026 01:54 pm
సంక్రాంతి సందడిని ముందే తీసుకొస్తూ మన శంకరవరప్రసాద్ గారు భారీ ఓపెనింగ్ సాధించింది. చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటించిన ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన నిమిషాల్లోనే ప్రధాన నగరాల్లో హౌస్‌ఫుల్ నమోదైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు స్పెషల్ ప్రీమియర్ షోలు నేటి రాత్రి 8 నుంచి. తెలంగాణలో టికెట్ ధర రూ.600, ఏపీలో రూ.500గా నిర్ణయించారు. ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.