ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బొజ్జు
NEWS Jan 11,2026 05:19 pm
ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో వెల్నెస్ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేని పేద ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా మొదటిదశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించాలని, తీవ్రతరం అయ్యే వరకు నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.